iQOO Neo 10 Pro: రూ.50 వేల ధర గల ఫీచర్లు ఇప్పుడు కేవలం రూ.35 వేలకే.! 11 month ago

featured-image

చైనాలో సూపర్ హిట్ అయిన స్మార్ట్‌ఫోన్ ని VIVO కంపెనీ ఇండియాలో కూడా లాంచ్ చెయ్యడానికి సిద్ధంగా ఉంది. అద్భుతమైన ఫీచర్లుతో అందరి మెప్పును పొందిన ఈ IQOO NEO 10 PRO భారత్ లో అడుగు పెట్టనుంది. IQOO సంస్థ VIVO కంపెనీ యొక్క సబ్-బ్రాండ్. మీడియాటెక్ ప్రాసెసర్, అద్భుతమైన LTPO AMOLED డిస్‌ప్లే, వేగవంతమైన పనితీరు, భారీ బ్యాటరీతో ఈ ఫోన్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ఈ ఫోన్ ఫీచర్ల వైపు ఒక లుక్ వేద్దాం రండి!


iQOO Neo 10 Pro ఫీచర్లు:

  • ప్రాసెసర్ : MediaTek Dimensity 9400
  • డిస్‌ప్లే : 6.78-అంగుళాల LTPO AMOLED
  • రిఫ్రెష్ రేట్ : 144Hz
  • పీక్ బ్రైట్‌నెస్ : 4500 nits
  • బ్యాక్ కెమెరా : 50MP మెయిన్ కెమెరా

                                    50MP అల్ట్రా-వైడ్ కెమెరా

  • ఫ్రంట్ కెమెరా : 16MP
  • బ్యాటరీ : 6100mAh, 120W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్
  • RAM & స్టోరేజ్: 12GB RAM + 256GB స్టోరేజ్
  • ఆపరేటింగ్ సిస్టమ్ : Android 15.. OriginOS



కనెక్టివిటీ ఫీచర్లు:

  • బ్లూటూత్ 5.4
  • Wi-Fi 7-- 5GHz 6GHz
  • USB టైప్-C పోర్ట్
  • 5G డ్యూయల్ సిమ్ స్లాట్


ఇతర ఫీచర్లు:

  • ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
  • స్టీరియో స్పీకర్లు


లోపాలు:

ఈ ఫోన్ కేవలం ఒక వేరియంట్ తో మాత్రమే వస్తుంది. ఫ్రంట్ కెమెరా 1080p క్వాలిటీ వీడియోస్ మాత్రమే ఇస్తుంది. ఇది డ్యూయల్ కెమెరా మొబైల్.. దీనికున్న ఫీచర్లుతో ఇంకొక ఎక్సట్రా కెమెరాను కూడా యాడ్ చెయ్యొచ్చు. ఈ ఫోన్ వాటర్ రెసిస్టన్స్ కాదు. 


iQOO Neo 10 Pro మొబైల్ లాంచ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. దీని ధర సుమారు రూ.34,999 ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం ఈ ఫీచర్లు ఉన్న IQOO 13, ONEPLUS 13 స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లో రూ.50 వేల వరుకు పలుకుతున్నాయి. వీటితో పోలిస్తే ఇది చాల తక్కువ ధరకే వస్తుంది. పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే ఇది ఏమాత్రం వాటికీ తీసిపోదు. వేగవంతమైన పనితీరు, అద్భుతమైన డిస్‌ప్లే, దీర్ఘకాలం ఉండే బ్యాటరీ కోరుకునే వారికి iQOO Neo 10 Pro ఒక మంచి ఎంపిక.

Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD